News September 12, 2025
ASIA CUP: ఇప్పటికీ ఫైనల్ ఆడని భారత్-పాక్

ఆసియా కప్ చరిత్రలో భారత్-పాకిస్థాన్ ఇంతవరకూ ఫైనల్లో తలపడలేదు. ఇప్పటివరకు 16 ఎడిషన్లు జరగ్గా ఈ రెండు జట్లూ ఒకేసారి ఫైనల్ చేరుకోలేదు. గ్రూప్ స్టేజ్, సూపర్-4, సెమీఫైనల్ వరకే తలపడ్డాయి. ఇరు జట్లూ 19 సార్లు పోటీ పడగా 10 మ్యాచుల్లో భారత్, ఆరింటిలో పాక్ గెలిచింది. మరో 3 మ్యాచులు టైగా ముగిశాయి. మరి ఈసారైనా దాయాది జట్లు ఫైనల్‌లో పోటీ పడతాయా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News March 13, 2026
‘కుక్కపిల్లలా ట్రంప్’.. కాలిఫోర్నియా గవర్నర్ పోస్ట్ వైరల్

ట్రంప్‌పై కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. చమురు సంక్షోభం వేళ రష్యన్ ఆయిల్‌ను కొనేందుకు ట్రంప్ ప్రపంచ దేశాలకు APR 11 వరకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో రష్యాకు భారీగా లబ్ధి చేకూరనుంది. ఈ క్రమంలో పుతిన్ ట్రంప్‌ను పెంపుడు కుక్కపిల్లలా కట్టేసి లాక్కెళ్తున్నట్లు ఉన్న ఎడిటెడ్ ఫొటోను గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా ట్రంప్ రిపబ్లికన్, గవర్నర్ న్యూసమ్ డెమోక్రటిక్.
News March 13, 2026
శుక్రవారం రోజున జన్మిస్తే..

శుక్రవారం నాడు జన్మించినవారిపై శుక్రుడి ప్రభావం ఉంటుందని జ్యోతిషులు చెబుతున్నారు. ‘వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అపార సంపద గల యోగాన్ని కలిగి ఉంటారు. కష్టపడితే స్వయంకృషితోనే గొప్ప స్థాయికి చేరుకునే అదృష్టం ఉంటుంది. సినిమా, మీడియా రంగాల్లో రాణిస్తారు. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి ఇంకా మంచి ఫలితాలుంటాయి. వీరు రాజరాజేశ్వరి దేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పారాయణం చేయాలి’ అని సూచిస్తున్నారు.
News March 13, 2026
SMలో పోర్నోగ్రఫీకి పిల్లలు బలి.. హర్భజన్ ఆవేదన

సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లలపై తీవ్రంగా పడుతోందని మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. అందులో విస్తృతంగా లభించే అసభ్యకర, పోర్నోగ్రఫీకి 12-13 ఏళ్ల పిల్లలు బలి అవుతున్నారని, వారి భవిష్యత్తు నాశనమవుతోందని పేర్కొన్నారు. యువతను సంరక్షించేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వాడకంపై కఠిన ఆంక్షలు విధించాలని కేంద్రానికి సూచించారు.


