News September 12, 2025
సాగులో విత్తనశుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలు

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.
Similar News
News September 12, 2025
నేరాల్లో ‘అగ్రరాజ్యం’

వరుస నేరాలతో అగ్రరాజ్యం అమెరికా ప్రతిష్ఠ మసకబారుతోంది. గత కొంత కాలంగా అక్కడ క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం <<17637268>>ఉక్రెయిన్ శరణార్థి<<>> బస్సులో హత్యకు గురైంది. రెండు రోజుల క్రితం ట్రంప్ <<17674039>>సన్నిహితుడినే<<>> బహిరంగంగా కాల్చి చంపారు. నిన్న ఏకంగా భారతీయుడి <<17684402>>తల నరికేశారు<<>>. దీంతో అక్కడున్న భారతీయులు, ఇండియాలో ఉన్న వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
News September 12, 2025
రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు: జయప్రకాశ్ నారాయణ

AP: రాజకీయాన్ని తిట్టడం మనల్ని మనం అవమానించుకోవడమే అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. ‘నిజాయితీ గల, దాపరికాలులేని చర్చ ఎంతో అవసరం. అలాంటి వేదికను ఏర్పాటు చేసిన వే2న్యూస్‌కు అభినందనలు. రాజకీయ నాయకులపై బురద చల్లడం, తిట్టడం చేస్తాం. కానీ కనిపిస్తే వంగి దండాలు పెడతాం. అతి వినయం, అవమానించడం అవసరం లేదు. రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు’ అని తెలిపారు.
News September 12, 2025
రాష్ట్రంలో 4,687 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ఇటీవల పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో నియామక విధివిధానాలు వెలువడనున్నాయి. కాగా ప్రస్తుతం ₹7,000 వేతనం అందుకుంటున్న కార్యకర్తలు ప్రమోషన్ల తర్వాత ₹11,500 అందుకోనున్నారు.