News April 4, 2024

గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హౌరా-యశ్వంతపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైలును గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు రైల్వే అధికారి బుధవారం తెలిపారు. ఈనెల 4, 11 తేదీల్లో ఈ రైలు (02863) హౌరాలో 12.40 గంటలకు బయలుదేరి విజయవాడ మరుసటి రోజు 07.25, గుంటూరు 08.20, యశ్వంతపూర్ శనివారం 00.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (02864) ఈనెల 6, 13 తేదీల్లో యశ్వంతపూర్‌లో 5 గంటలకు ప్రారంభమై గుంటూరు 17.25 వస్తుంది.

Similar News

News March 16, 2026

రేపే ఏపీ ఈడీబీ నూతన కార్యాలయం ప్రారంభం

image

ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (EDB) నూతన కార్యాలయాన్ని మంత్రి నారా లోకేశ్ మంగళవారం ప్రారంభించనున్నారు. మంగళగిరి హైవేలోని మయూరి టెక్ పార్క్‌లో ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు APIIC టవర్స్‌ నుంచి కార్యకలాపాలు సాగించగా, ఇకపై మయూరి టెక్ పార్క్ నుంచి సేవలు అందించనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా అధికారులతో లోకేశ్ భేటీ కానున్నారు.

News March 16, 2026

GNT: గ్యాస్ సరఫరాపై అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష

image

ఎల్బీజీ గ్యాస్ సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్బీజీ గ్యాస్ సరఫరా, పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలు, వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, పారదర్శక సేవలు అందించాలన్నారు.

News March 16, 2026

అమరజీవి త్యాగం.. తెలుగు జాతికి పునాది: మంత్రి సవిత

image

అమరావతిలో 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా  58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం ఏర్పాటు అభినందనీయమని మంత్రి సవిత కొనియాడారు. అమరావతిలోని సోమవారం నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఆమె మాట్లాడారు. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావించిందన్నారు. నేటి తెలుగు ప్రజల ఉనికి పొట్టి శ్రీరాముల పోరాటంతోనే సాధ్యమైందన్నారు.