News September 12, 2025
కూకట్‌పల్లి: రేణు హత్య కేసులో పురోగతి

కూకట్‌పల్లిలో వ్యాపారి భార్య రేణు అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం నిందితుల కోసం ఝార్ఖండ్‌కు వెళ్లింది. కాగా, నిందితులు హర్ష, రోషన్.. రేణు హత్య అనంతరం వాడిన స్కూటీని హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News March 11, 2026
‘పీఎం సేతు’తో ఐటీఐల బలోపేతం: కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లాలోని ఐటీఐ కేంద్రాలను ఆధునీకరించి, యువతకు మెరుగైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ‘పీఎం సేతు’ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ అధికారులతో సమీక్షించిన ఆమె ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
News March 11, 2026
NTR: వచ్చే నెల నుంచే యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు

రాష్ట్ర ప్రజలకు యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ఆపై రూ.25L వరకు NTR వైద్య సేవ కింద వైద్యం అందిస్తారు. ఈ పథకాన్ని ఏప్రిల్ 1న ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సుమారు 6 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు టెండర్లలో పాల్గొనగా, ఓ కంపెనీ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో NTR వైద్య సేవ కింద కేటాయించిన రూ.4 వేల కోట్ల నిధులను ఓ బీమా సంస్థకు కేటాయించనున్నారు.
News March 11, 2026
మార్చి 21నుంచి కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర

పెద వాల్తేరులో వేంచేసిన కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు మార్చ్ 21నుంచి ఏప్రిల్ 21వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పలు విభాగాల అధికారులతో మహారాణి పేట డిప్యూటీ తహశీల్దార్ సనపల చైతన్య ఆధ్వర్యంలో అలయ ఈఓ సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులకు భీమిలీ RDO పలు సూచనలు చేశారు. క్యూ లైన్ నిర్వహణ, శానిటేషన్, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాల పలు సూచనలు చేశారు.


