News September 12, 2025

47 ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక

image

రాంచీలోని MECON లిమిటెడ్‌లో 47 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో అడిషనల్ ఇంజినీర్, Dy.ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులున్నాయి. ఉద్యోగానుభంతోపాటు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 15, 16, 19, 20వ తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అప్లికేషన్ ఫామ్, ఇతర పూర్తి వివరాల కోసం <>https://meconlimited.co.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

Similar News

News March 14, 2026

5 అమెరికా విమానాలపై ఇరాన్ దాడి: WSJ

image

ఇరాన్ మిస్సైళ్ల దాడిలో అమెరికాకు చెందిన 5 ఎయిర్ ఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో ఉన్న ఆ విమానాలపై ఇరాన్ దాడి చేసిందని పేర్కొంది. అయితే అవి పూర్తిగా ధ్వంసం కాలేదని, పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపింది. ఎవరూ మరణించలేదని వివరించింది. కాగా నిన్న ఇరాక్‌లో కూలిన అమెరికా KC-135లోని ఆరుగురు సిబ్బంది మరణించారు.

News March 14, 2026

ఇరాన్‌పై అత్యంత శక్తిమంతమైన బాంబులు వేశాం: ట్రంప్

image

మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన బాంబులను ఇరాన్‌లోని <<19335967>>ఖర్గ్<<>> ద్వీపంపై వేశామని ట్రంప్ ప్రకటించారు. అందులోని మిలిటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను టచ్ చేయలేదని చెప్పారు. హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటే మాత్రం వెంటనే ఆ పని చేసి తీరుతామని స్పష్టం చేశారు. తన హయాంలో అమెరికా సైన్యం చాలా పవర్‌ఫుల్‌గా మారిందని, తమ దాడులను తట్టుకునే శక్తి ఇరాన్‌కు లేదన్నారు.

News March 14, 2026

‘వేటగాడు’ నిర్మాత అర్జునరాజు కన్నుమూత

image

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.అర్జునరాజు(80) నిన్న హైదరాబాద్‌లో వృద్ధ్యాప్య సమస్యలతో కన్నుమూశారు. ఎన్టీఆర్ ‘వేటగాడు’ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన ఆయన ‘కొండవీటి సింహం’, ‘జేబుదొంగ’, ‘అడవి సింహాలు’, ‘బావనచ్చాడు’, ‘జాబిల్లి’, ‘మా నాన్నకు పెళ్లి’ వంటి సినిమాలను నిర్మించారు. హిందీలో 6 సినిమాలు చేశారు. ఆయన కుమారుడు రామలింగరాజు కూడా ‘జగపతి’, ‘మా అల్లుడు వెరీగుడ్’ వంటి సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.