News September 12, 2025

MDK: గురు’కూలే’ భవనాలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ గురుకులాలు వసతి గృహాల పరిస్థితి అధ్వానంగా తయారైనా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. SRD జిల్లా లింగంపల్లి శివారులోని గురుకుల పాఠశాలలోని హాస్టల్‌ భవనం రెండు రోజుల కిందట కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. SDPT లో మైనార్టీ గురుకుల పాఠశాల అధ్వానంగా ఉంది. MDK రామాయంపేట ఎస్సీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది.

Similar News

News September 12, 2025

గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్రాంతంగా తిరుపతి: కలెక్టర్

image

టూరిజంపై పెట్టుబడిదారుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడుదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి, తిరుమలలో పెళ్లి చేసుకోడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతారని, తిరుపతిని గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్రాంతంగా అభివృద్ధి చేసేలా టూరిజం,TTD చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

News September 12, 2025

విజయనగరం కలెక్టర్‌కు సన్మానం

image

విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్‌‌ను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. జిల్లా నుంచి బదిలీ అయిన నేపథ్యంలో రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్‌‌ను తన ఛాంబర్లో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

News September 12, 2025

నల్గొండ: 15న ప్రజావాణి రద్దు

image

రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నందున ఈ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.