News September 12, 2025

ఆర్థిక సమస్యలున్నా అందరికీ ప్రయోజనం: అనగాని

image

AP: రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్నా తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ‘జీఎస్టీ వసూళ్లు, వృద్ధి రేటులో రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది. రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

BREAKING: తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.980 తగ్గి రూ.1,61,240కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.900 పడిపోయి రూ.1,47,800 పలుకుతోంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

News March 13, 2026

అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.6వేలు

image

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.6వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కృష్ణా(D) గన్నవరంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.4వేలు.. మొత్తంగా రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.

News March 13, 2026

అన్నదాతా సుఖీభవ-అర్హత ఇలా తెలుసుకోవచ్చు

image

ఆన్‌లైన్‌లో annadathasukhibhava.ap.gov.in/ ద్వారా రైతులు తమ అర్హతను తెలుసుకోవచ్చు. పైన పేర్కొన్న పోర్టల్‌కి వెళ్లి Know Your Status ఆప్షన్ ఎంచుకొని.. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత searchపై క్లిక్ చేస్తే.. మీ పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలతో పాటు పథకానికి అర్హులైతే స్టేటస్ దగ్గర Eligile అని వస్తుంది. ఒకవేళ కాకుంటే Remarks దగ్గర అందుకు గల కారణాలు వస్తాయి.