News September 12, 2025
పాడేరు: 12 నుంచి హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి

పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ పేర్కొన్నారు. శుక్రవారం పీవో ఛాంబర్‌లో హాట్ ఎయిర్ బెలూన్ డిజిటల్ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. మెగా ఈగల్ ఫ్లై సంస్థ ఆధ్వర్యంలో 12 నుంచి పర్యాటకులకు పద్మాపురం గార్డెన్‌లో దీన్ని అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఇందులో పర్యాటకులు విహరించవచ్చని అన్నారు.
Similar News
News March 4, 2026
టీచర్ల జీతాలను ప్రభుత్వం తగ్గించదు: KK

TG: ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గించాలంటూ విద్యాకమిషన్ సర్కారుకు నివేదిక ఇచ్చిందన్న వార్తలపై ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ కే.కేశవరావు స్పందించారు. ప్రభుత్వం టీచర్ల జీతాలను తగ్గించదని స్పష్టం చేశారు. శాలరీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఉపాధ్యాయ సంఘాలను పిలిచి మాట్లాడుతామని చెప్పారు. అన్ని జీవోలు పబ్లిక్ డొమైన్‌లో పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నెల రోజుల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తెస్తుందని వివరించారు.
News March 4, 2026
తిరుపతి కలెక్టర్‌ను కలిసిన ఖాదీ బోర్డు ఛైర్మన్

తిరుపతి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్‌ను ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కెకె చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణపై చర్చించినట్లు సమాచారం. జిల్లా అభివృద్ధికి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని వారు అభిప్రాయపడ్డారు.
News March 4, 2026
నిర్మల్‌లో వందరోజుల కార్యక్రమం ప్రారంభం

బాల్యవివాహాల నిర్మూలనకు జిల్లా యంత్రాంగం 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించాలని ఉద్దేశంతో బాల్య వివాహ రహిత భారత్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులు ప్రచార రథం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలు విద్యాసంస్థలలో విస్తృత అవగాహన కల్పించనున్నారు. 18,21 సంవత్సరాలు లోపు బాల బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని జరిగే పరిణామాలను వివరించనున్నారు.


