News September 12, 2025

భూపాలపల్లి: 23 రైతు వేదికల ద్వారా యూరియా విక్రయాలు

image

రైతులకు యూరియాను సకాలంలో అందించడానికి కొత్తగా 23 రైతు వేదికల ద్వారా యూరియా విక్రయిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. రేగొండ మండలం మడతపల్లి, దమ్మన్నపేట,మొగుళ్లపల్లి మండలంలో ములకలపల్లి, పర్లపల్లి, వేములపల్లి, చిట్యాలలో చైన్పాక, జూకల్, ఘనపూర్లో పరశురాంపల్లి, ఘనపూర్, భూపాలపల్లిలో పెద్దాపూర్, మలహర్‌లో రుద్రారం, మహదేవపూర్‌లో సూరారం, మహదేవపూర్, కాళేశ్వరంలలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Similar News

News September 12, 2025

HYD: ఈ ప్రాంతాల్లో STP కేంద్రాల నిర్మాణం

image

ORR పరిధిలో 39 మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగనుంది. STP కేంద్రాల లిస్టును జలమండలి విడుదల చేసింది. అమీన్‌పూర్, తెల్లాపూర్, ఐక్రిసాట్, ఉష్కేబావి, బాచుగూడ, తిమక్క చెరువు, గాంధీ గూడెం, పీర్జాదిగూడ, నాగారం, నార్సింగి (ORR), సాంగం (బాపూఘాట్), హైదర్షాకోట, ఫతేనగర్, చిట్రాపురి కాలనీ, HYD పబ్లిక్ స్కూల్, మీర్పేట్, మసాబ్‌చెరువు, కాప్రా, రవిర్యాల్, బొంగులూరు వంటి ప్రాంతాల్లో నిర్మిస్తామన్నారు.

News September 12, 2025

నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

క‌లెక్ట‌ర్ డా. జి. ల‌క్ష్మీశా శుక్ర‌వారం రాత్రి విజయవాడ న్యూ రాజ‌రాజేశ్వ‌రిపేట‌, పరిస‌ర ప్రాంతాల్లోని 11 వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌తిరోజూ ఇంటింటి ఫీవ‌ర్‌ స‌ర్వే నిర్వ‌హ‌ణ‌, డయేరియా బారిన‌ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం త‌దిత‌రాల‌పై సూచ‌న‌లు చేశారు. ప్ర‌త్యేక క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News September 12, 2025

VJA: చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు 106 మంది

image

విజయవాడ న్యూ రాజ‌రాజేశ్వ‌రిపేట డ‌యేరియా కేసుల 194కు చేరినట్లు కలెక్టర్ లక్ష్మీశా శుక్రవారం రాత్రి 7 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. కలెక్టర్ విడుదల చేసిన బుల్ టెన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం న‌మోదైన కేసులు: 194, ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న‌వారు: 106, చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయిన‌వారు: 88గా ఉన్నాయి.