News September 12, 2025

JNTUH: బీటెక్ సెకెండ్ సెమిస్టర్ రిజల్ట్స్

image

బీటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను వర్సిటీ అధికారులు రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లో విద్యార్థులు తక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కేవలం 42.38 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు వర్సిటీ వెబ్ సైట్‌లో ఉన్నాయని ఎగ్జామినేషన్ డైరెక్టర్ క్రిష్ణమోహన్ రావు తెలిపారు.

Similar News

News March 10, 2026

HYD: మెట్రో.. ఇలా నడిపితే డేంజరే!

image

మెట్రో పెచ్చులూడుతున్నా.. ఆఫీసర్లు తేరుకోవడం లేదు. గతంలో అమీర్‌పేట్ స్టేషన్‌లో జరిగిన విషాదం(మౌనిక మృతి) తర్వాత కూడా మెట్రో భద్రతపై సమగ్ర ఆడిట్ రిపోర్టును ప్రభుత్వం ప్రజల ముందు ఉంచలేదు. 2025లో జరిగిన అంతర్గత తనిఖీల్లో Non-Air కండిషన్డ్ ఏరియాల్లో స్లాబ్ ఫెయిల్యూర్ సంకేతాలు ఉన్నట్లు తేలినా కాస్మెటిక్ రిపేర్లతో సర్దుబాటు చేశారు. థర్డ్ పార్టీ సేఫ్టీ సర్టిఫికేషన్ లేకుండానే మెట్రో రైళ్లను నడపడం డేంజరే.

News March 10, 2026

HYDలో రూ.430 కోట్లతో మరో కేబుల్ బ్రిడ్జ్

image

HYDలో మరో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. మీర్ ఆలం ట్యాంక్ మీదుగా ఈ కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తారు. దీనిని 2.65 KMల పొడవు, 22.2 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి మీర్ ఆలం ట్యాంక్ సమీపంలోని NH 44 నుంచి మీర్ ఆలం పార్క్ సమీపంలోని చింతల్మెట్ రోడ్డు వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.430 CR మంజూరు చేసింది. MP అసదుద్దీన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు.

News March 10, 2026

HYD: మూడు ముక్కలు.. కానీ ‘POWER’ అక్కడే!

image

గ్రేటర్ HYDను 3 కార్పొరేషన్లు(GHMC, MMC, CMC)గా విభజించారు. అయితే తెలంగాణ మున్సిపల్ చట్టం(సవరణ) 2024 ప్రకారం 10 అంతస్తులపైన కట్టే ‘హై రైజ్’ బిల్డింగుల పర్మిషన్ ఫీజు ఇకపై నేరుగా HMDA ఖాతాలోకి వెళ్తుంది. అంటే కొత్తగా ఏర్పడిన MMC, CMCలకు కేవలం డ్రైనేజీ, చెత్త ఏరడం వంటి ఖర్చులతో కూడిన పనులే మిగిలాయి. ఆదాయం వచ్చే పర్మిషన్ల పవర్ లేకపోవడంతో ఈ సంస్థలు భవిష్యత్తులో జీతాల కోసం అప్పులు చేయక తప్పని పరిస్థితి.