News April 4, 2024

నాతో రేప్ సీన్ చేయనని హీరోయిన్ ఏడ్చింది: రంజిత్

image

అలనాటి నటి మాధురీ దీక్షిత్ తనతో రేప్ సీన్‌లో నటించలేనని బోరున ఏడ్చేశారని వెటరన్ యాక్టర్ రంజిత్ వెల్లడించారు. 1989లో వచ్చిన రొమాంటిక్ మూవీ ‘ప్రేమ్ ప్రతిజ్ఞ’లో మిథున్ చక్రవర్తి, మాధురి జంటగా నటించారు. ఈ సినిమాలో రంజిత్ హీరోయిన్‌ను తోపుడు బండిపై రేప్ చేసే సీన్ ఉంటుంది. అయితే.. ఆ సీన్ చేయమని డైరెక్టర్ అడగ్గా.. మాధురి ఏడ్చి, ఆ సీన్‌లో నటించలేనని వేడుకున్నారట. బతిమాలితే చివరికి ఒప్పుకున్నారట.

Similar News

News March 24, 2026

RDTకి అనుమతులు.. CBN క్రెడిట్ చోరీ: జగన్

image

AP: RDTకి FCRA <<19461876>>అనుమతుల<<>> విషయంలో CM CBN క్రెడిట్‌ చోరీకి పాల్పడడం ఆశ్చర్యంగా ఉందని జగన్ ట్వీట్ చేశారు. ‘నిజంగా ఆయన కృషి చేసి ఉంటే 2025 APRలో నిలిచిపోయిన పర్మిషన్ల రెన్యువల్‌కు ఏడాదికాలం ఎందుకు పట్టింది? CBN పట్టించుకోకపోవడం వల్లే YCP, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా’ అని ప్రశ్నించారు. పర్మిషన్లు రెన్యువల్‌ చేసినందుకు PM మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.

News March 24, 2026

యుద్ధం.. మోదీకి ట్రంప్ ఫోన్

image

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేశారు. పశ్చిమాసియా యుద్ధం, రెండు దేశాలపై దాని ప్రభావం గురించి ఇద్దరు నేతలు చర్చించారు. హార్ముజ్‌లో నౌకలు చిక్కుకోవడం, జలసంధిని తెరిపించాల్సిన అవసరంపై మాట్లాడుకున్నారు. మరోవైపు యుద్ధం వల్ల దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలు సిద్ధంగా ఉండాలని మోదీ ఇప్పటికే దేశ <<19465598>>ప్రజలకు<<>> పిలుపునిచ్చారు.

News March 24, 2026

పుదుచ్చేరి పీఠం ఎవరిదో? – 1/2

image

నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి భవితవ్యం కూడా ఈసారి ఆసక్తికరంగా మారాయి. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) ఆధ్వర్యంలోని NDA మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది. అయితే AINRC-BJP దోస్తీ కాస్త సడలిందనే టాక్ నడుస్తోంది. అమిత్ షా బుజ్జగింపుతో AINRC చీఫ్, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి శాంతించినా విజయ్ TVK ఎంట్రీ, రాష్ట్ర హోదా డిమాండ్‌ హాట్ టాపిక్‌గా మారింది. <<-se>>#Elections2026<<>>