News September 12, 2025
జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా రాజా గౌడ్

జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్)గా రాజా గౌడ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను అడిషనల్ కలెక్టర్‌ను నియమించినట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు రాజా గౌడ్ విధుల్లో చేరనున్నారు.
Similar News
News March 25, 2026
ఆముదం సాగుకు అనువైన సూటి రకాలు

☛ హరిత: పంట కాలం 130-150 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్లు. ఎండు తెగులు, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ☛ జ్వాల: పంట కాలం 90-180 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్లు. ఎండు తెగులు, బూజు తెగులును తట్టుకుంటుంది.
☛ DDS-107: పంట కాలం 100-150 రోజులు. దిగుబడి ఎకరాకు 5.5 క్వింటాళ్లు. ఎండు తెగులును తట్టుకుంటుంది.
☛ ప్రగతి: పంట కాలం 120-140 రోజులు. దిగుబడి ఎకరాకు 6- 7 క్వింటాళ్లు.
News March 25, 2026
రెండుగా విడిపోనున్న ‘కరీంనగర్’..?

అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను పెంచుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్ నియోజకవర్గం 2 నియోజకవర్గాలయ్యే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం KNR, KNR రూరల్, కొత్తపల్లి మండలాలతో ఒక నియోజకవర్గంగా ఉంది. KNR మండలాన్ని ఒక నియోజకవర్గంగా, కొత్తపల్లి, KNR రూరల్ మండలం కలిపి మరో నియోజకవర్గమయ్యే అవకాశాలు ఉన్నాయని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
News March 25, 2026
నేడు గుంటూరుకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు గుంటూరుకు వెళ్లనున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూతురు వివాహానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. వేడుక అనంతరం రేవంత్ హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


