News September 12, 2025

స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు ఏమైనా చేస్తాం: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు తాము దేనికైనా సిద్ధమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా నిలిచిపోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. 32 విభాగాలను ఔట్‌సోర్సింగ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఉద్ధరిస్తున్నట్లు చూపుతున్నారు’ అని బొత్స మండిపడ్డారు.

Similar News

News March 21, 2026

ముస్లింల వస్తువులు వద్దన్నారు.. క్రూడాయిల్ ఎందుకు కొంటున్నారు: అసద్

image

TG: దేశంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలు తయారుచేసే వస్తువులు కొనవద్దని తీర్మానం చేసిన బీజేపీ అరబ్ దేశాల నుంచి క్రూడాయిల్ ఎందుకు కొనుగోలు చేస్తోందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి భారత్‌లో అన్ని వర్గాల కోసం పని చేస్తున్నామని చెప్తుండటం పచ్చి అబద్ధమన్నారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం కొరత ఉన్నా అలాంటిదేం లేదని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

News March 21, 2026

పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

image

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో LPG <<19316911>>గ్యాస్<<>>, పవర్ పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెగ్యులర్ పెట్రోల్ విషయంలో ఆందోళన నెలకొంది. సాధారణ వాహన ఇంధన ధరలను <<19436412>>పెంచబోమని<<>> IOCL ప్రకటించింది. కానీ పలు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయని తెలుస్తోంది. పెట్రోల్‌పై ₹10-15, డీజిల్‌పై ₹10 వరకు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News March 21, 2026

ఉదయాన్నే కాఫీ/టీ తాగితే..

image

కాఫీ, టీ తాగితే మంచిదా? కాదా? అనే అంశంపై విభిన్న ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా USకు చెందిన హార్వర్డ్, MIT సైంటిస్టులు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఉదయాన్నే కెఫిన్ ఉన్న కాఫీ/టీని మితంగా తీసుకుంటే డిమెన్షియా(మతిమరుపు) ప్రమాదం 18% తగ్గుతుందని పేర్కొన్నారు. స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. 43 ఏళ్లలోపు వయసున్న 1,31,821 మంది డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని తెలిపారు.