News September 12, 2025

KNR: ఆగిన నిధులు.. పారిశుద్ధ్యం వెతలు..!

image

కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో పల్లెల్లో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి KNR వ్యాప్తంగా 1216 గ్రామాల్లో పారిశుద్ధ్యం, మురుగు కాలువలు, విద్యుద్దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. మున్సిపాలిటీలు, పల్లెల్లో ఫాగింగ్ మెషీన్లున్నా నిరుపయోగంగా మారాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, వైరల్ జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

Similar News

News September 12, 2025

వరంగల్: బియ్యం నిల్వపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం

image

ఏనుమాముల బియ్యం నిల్వ కేంద్రంలో ముక్కిన బియ్యం, మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని కలిపి ఉంచిన వ్యవహారంపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన ఆమె, ఈ నిర్లక్ష్యానికి కారణమైన పౌరసరఫరాల డీఎం, ఎం.ఎల్.ఎస్. ఇన్‌ఛార్జిలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

News September 12, 2025

చాగలమర్రి: కుందూ నదికి పోటెత్తిన వరద

image

భారీ వర్షాల కారణంగా చాగలమర్రి మండలం కుందూ నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాగలమర్రి మండలంలో 13 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కుందూ నదిలో 28 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చాగలమర్రి తహశీల్దార్ విజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News September 12, 2025

భీమారంలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం

image

భీమారం జడ్పీహెచ్ఎస్‌లో శుక్రవారం సోషల్ స్టడీస్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం జరిగింది. స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ జి.శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి హాజీపూర్, మంచిర్యాల, నస్పూర్, భీమారం, జైపూర్ మండలాల ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యాశాఖ సూచించిన ఎజెండా ప్రకారం ఈ సమావేశం నిర్వహించినట్లు ఎంఈఓ గోపాల్ రావు తెలిపారు.