News September 12, 2025

BREAKING.. KMR: బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ వాయిదా

image

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క చెప్పారు. శుక్రవారం మాచారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తిరిగి సభను నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Similar News

News September 12, 2025

అవినీతిని అడ్డుకునేందుకు AI మినిస్టర్.. ఎక్కడో తెలుసా?

image

ప్రపంచంలోనే ఏఐ ఆధారంగా పనిచేసే మంత్రిని అల్బేనియా దేశం నియమించింది. ఈ ఏఐ మహిళా మంత్రికి ‘డియెల్లా’ అని పేరు పెట్టింది. ఈమె అన్ని ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షిస్తారు. దీనిద్వారా అల్బేనియా ప్రభుత్వం అవినీతిని తగ్గించొచ్చని భావిస్తోంది. అల్బేనియాలో ప్రభుత్వ టెండర్లు & ప్రజా నిధుల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.

News September 12, 2025

ప్రమాదానికి గురైన వ్యక్తి మృతి

image

బాపట్లలో శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ వద్ద కళాశాల బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో న్యాయవాది చిన్నుకొని జనార్దన్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించగా, మెరుగైన చికిత్సకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. న్యాయవాది మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

News September 12, 2025

రేపు, ఎల్లుండి జిల్లాకు భారీ వర్ష సూచన

image

రానున్న ఐదు రోజులు భద్రాద్రి జిల్లాలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. 13, 14వ తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. 17వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపు నీరు నిలువ లేకుండా చూసుకోవాలని నోడల్ ఆఫీసర్ హరీష్ కుమార్ శర్మ తెలిపారు.