News April 4, 2024
NLG: ఫేక్ సర్టిఫికెట్స్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో నకిలీ ధ్రువపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న సుమారు 1,200 మంది ఆర్టిజన్ ఉద్యోగులలో కొంత మంది నకిలీ ధ్రువపత్రాలతో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో కొంతమంది విద్యార్హత లేకుండా నకిలీ ధ్రువపత్రాలతో ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తూ బురిడీ కొట్టించారు. 11 మంది ఆర్టిజన్ ఉద్యోగుల ధ్రువీకరణ పత్రాలు నకిలీవిగా తేల్చారు.
Similar News
News March 16, 2026
నల్గొండ: దివ్యాంగుల కోసం ప్రతి నెలాఖరున ‘ప్రత్యేక ప్రజావాణి’

దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నెల 28న దీన్ని ప్రారంభిస్తున్నామని, దీనికి అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రంజాన్ తోఫా పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
News March 16, 2026
నాగార్జునసాగర్ తీరంలో సైక్లింగ్ జోష్

అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు వచ్చే సందర్శకుల కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాగర్ తీరంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ప్రారంభించారు. విజయవిహార్ అతిథి గృహంలో ప్రస్తుతానికి 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. పర్యాటకులు గంటకు రూ.100 చొప్పున చెల్లించి ఈ సైకిళ్లను వినియోగించుకోవచ్చు.
News March 15, 2026
NLG: పల్లెల్లో ఇక ‘సౌర’ వెలుగులు..

సామాన్యుడి ఇంటిపై ఇక సౌర ఫలకలు మెరవనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ’ పథకం ద్వారా గ్రామాల్లో ఉచిత విద్యుత్ అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. తొలిదశలో భాగంగా నల్గొండ జిల్లాలోని కనగల్, అనుముల, ముదిగొండ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లోని ప్రతి ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.


