News September 12, 2025

MBNR: OCT 16న PUలో స్నాతకోత్సవం

image

పాలమూరు యూనివర్సిటీలో వచ్చేనెల 16న 4వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి కె.ప్రవీణ Way2Newsతో తెలిపారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ కోర్స్‌లలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు అన్ని కోర్సుల్లో 88 గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. ఈ స్నాతకోత్సవనికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరుకానున్నారు. యూనివర్సిటీలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.

Similar News

News March 11, 2026

MBNR : పదో తరగతి పరీక్షలు.. ఫోన్ వాడితే ఉద్యోగం ఊస్ట్!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరినీ మొబైల్ ఫోన్లతో అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఫోన్ వాడుతూ పట్టుబడితే, వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు.

News March 11, 2026

దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గండీడు (36.0), భూత్పూర్ (35.7), కోయిలకొండ (35.6) మండలాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంది. చిన్నచింతకుంట, అడ్డాకుల, నవాబుపేట ప్రాంతాల్లో 34 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News March 10, 2026

హెచ్‌సీఏ సెక్రటరీగా పాలమూరు వాసి నియామకం

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెక్రటరీగా పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మన్నే జీవన్ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఆయన తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి, తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.