News September 12, 2025

విజయదశమి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

image

విజయదశమి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, గొడవలకు తావులేకుండా పండుగ జరపడంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు.

Similar News

News March 25, 2026

నేడు గుంటూరుకు సీఎం రేవంత్ రెడ్డి

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు గుంటూరుకు వెళ్లనున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూతురు వివాహానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. వేడుక అనంతరం రేవంత్ హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

News March 25, 2026

వంటగ్యాస్ బుకింగ్.. కొత్త రూల్

image

సిలిండర్ల కొరత నేపథ్యంలో బుకింగ్ రూల్స్‌ను ఆయిల్ కంపెనీలు మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజుల తర్వాతే రీఫిల్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నాయి. ఇక ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి ఈ గడువు 45 రోజులు కాగా సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత బుక్ చేయాలి. అంతకంటే ముందుగా చేసే బుకింగ్స్‌ను సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది.

News March 25, 2026

కరెంట్ అఫైర్స్

image

* గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌-2026లో పాకిస్థాన్‌కు తొలి స్థానం
* Income Tax Act 2025పై అవగాహన కోసం ‘PRARAMBH 2026’ ప్రారంభం
* టెక్స్‌టైల్ ఎక్స్‌పోర్ట్స్‌లో 2024-25లో తమిళనాడు టాప్
* అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో లోయలో ఒక కొత్త అడవి కివీ జాతి Actinidia indicaని BSI కనుగొంది.
* ఢిల్లీలో జరిగిన ప్రకృతి-2026లో కార్బన్ ట్రేడింగ్, క్లైమెట్ యాక్షన్‌ క్రమబద్ధీకరణకు ఇండియన్ కార్బన్ మార్కెట్ పోర్టల్‌ ఏర్పాటు.