News September 12, 2025
MLHP సస్పెండ్.. DMHOకు కలెక్టర్ ఆదేశాలు

ఆత్మకూరు మం. కూరెళ్లలోని పల్లె దవాఖానను కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా MLHP డాక్టర్ అశోక్ విధుల్లో లేకపోవడాన్ని ఆయన గమనించారు. కాగా, ఆయన రోజూ సరిగ్గా విధులకు హాజరుకావట్లేదని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే MLHPని సస్పెండ్ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News March 22, 2026
భద్రకాళి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ

భద్రకాళి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయ ప్రాకారాలు తెరిచారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, విశేషాలంకరణ చేశారు. అనే ప్రధాన పూజారి భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
News March 22, 2026
మూడో రోజే ₹500 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్-2

రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ మైల్‌స్టోన్‌ని దాటింది. ఇండియాలో ₹339 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా ఓవర్సీస్ మార్కెట్‌లో ₹96 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు భారీ ఆక్యుపెన్సీ లభిస్తోంది.
News March 22, 2026
WGL: గ్యాస్ కొరత.. మూతబడుతున్న హోటల్స్

వరంగల్ నగరంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్స్ మూతపడుతున్నాయి. నగర వ్యాప్తంగా 3 వేల చిన్న, పెద్ద హోటల్స్ ఉండగా, గ్యాస్ కొరతతో 500కు పైగా హోటల్స్ మూత పడ్డాయి. దీంతో హోటల్ వృత్తిపై ఆధారపడిన వారు ఉపాధి కోల్పోతున్నారు. చిన్న, పెద్ద హోటళ్లు రోజూ వారి వినియోగానికి 4-5 సిలిండర్లు వాడుతున్నారు. సరఫరా తగ్గడంతో రేట్లు రూ.100-150కి పెరిగాయి. కొన్ని హోటల్స్ కట్టెలు, ఊక పొయ్యిలతో నడుపుతున్నారు.


