News September 12, 2025

గణపవరం: రోడ్డు ప్రమాదంలో వీఆర్‌వో మృతి

image

రోడ్డు ప్రమాదంలో గణపవరం మండలం ఎస్. కొండేపాడు వీఆర్‌వో అడబాల కనక దుర్గా ప్రసాద్ (50) మృతి చెందారు. పిప్పర వద్ద శుక్రవారం బైక్ పై వెళ్తున్న దుర్గా ప్రసాద్‌ను లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఆయన మృతి చెందారు. గణపవరం ఎస్ఐ ఆకుల మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు వీఆర్‌వో స్వస్థలం వీరేశ్వరపురం గ్రామం.

Similar News

News March 10, 2026

UAEలో రియల్ ఎస్టేట్ ఢమాల్.. గంటలోనే రూ.7.3 కోట్లు తగ్గిన ధర

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధంతో దుబాయ్, అబుదాబిలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోతోంది. అబుదాబిలోని అల్-జుబైల్‌లోని ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర ఒక గంటలోనే రూ.7.3 కోట్లు తగ్గిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. కాగా ఇరాన్ ఇప్పటివరకు యూఏఈపై వెయ్యికి పైగా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. దీంతో బిలియనీర్లు సేఫ్టీ కోసం దుబాయ్ వదిలి సింగపూర్‌కు షిఫ్ట్ అయి అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

News March 10, 2026

నల్గొండ: నెల రోజుల పాటు పదో తరగతి పరీక్షలు

image

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నెల రోజుల పాటు సాగనున్నాయి. మొత్తం 6 పరీక్షలే ఉన్నప్పటికీ, ప్రతి పేపర్‌కు మధ్య 4 నుంచి 6 రోజుల విరామం ఉండటంతో ఏప్రిల్ మధ్య వరకు షెడ్యూల్ ఖరారైంది. విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యేందుకు SSC బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పరీక్షలు త్వరగా ముగిసేవి, కానీ ఈసారి ప్రతి సబ్జెక్టుకు తగినంత సమయం లభించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 10, 2026

క్షమాపణ కోరిన NCERT

image

8వ తరగతి పుస్తకంలో <<19253509>>‘న్యాయ వ్యవస్థలో అవినీతి’<<>> పాఠ్యాంశంపై వివాదం చెలరేగడంతో NCERT బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పింది. ఇప్పటికే ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఈ పుస్తకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ కూడా ఆ పాఠ్యాంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.