News September 12, 2025
HYD: రాష్ట్ర చిహ్నాలతో రాస్తాకు అందం

కూడళ్ల వద్ద ఎక్కువగా మహనీయుల విగ్రహాలే వెలిగిపోతుంటాయి. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్‌లో ఈ దృశ్యం విభిన్నంగా మెరిసిపోతోంది. TG గౌరవ చిహ్నాలను శిల్పకళాఖండంగా ప్రతిష్ఠించిన తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇరువైపులా TG రాష్ట్ర జంతువులు మచ్చల జింకలు, మధ్యలో రాష్ట్ర పక్షి పాలపిట్ట సోయగం విరజిమ్ముతూ కనువిందు చేస్తోంది. ప్రయాణికుల చూపులను కట్టిపడేస్తోంది. మనసు దోచేస్తోంది.
Similar News
News September 12, 2025
GHMC, హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

GHMC, హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర రూ.వంద కోట్ల విలువైన స్థలానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హౌసింగ్ సొసైటీకి ఆదేశలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
News September 12, 2025
గాంధీ ఆస్పత్రిలో బాధ్యతలు స్వీకరించిన డా.వాణి

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా అడిషనల్ DME ప్రొ.డా.వాణి కాసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు పని చేసిన డా.రాజకుమారి గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా డా.వాణి మాట్లాడుతూ.. గాంధీలో సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
News September 12, 2025
HYD: పార్టీ మారిన MLAలపై KTR కామెంట్స్

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ కామెంట్స్ చేశారు. పార్టీ మార్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని గుర్తు చేశారు. వారితో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో చూపించి, ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా? అని ఎద్దేవా చేశారు. BRS టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో చేరలేదు అంటున్నారన్నారు.