News September 12, 2025
హన్మకొండ: స్నేహితుడి హత్య కేసులో జీవిత ఖైదు

డబ్బుల విషయంలో స్నేహితుడిని హత్య చేసిన కేసులో నిందితుడు పల్టియా రమేశ్‌కు హన్మకొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి బి.అపర్ణ దేవి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 2023 సెప్టెంబర్ 11న జరిగిన ఈ ఘటనలో రమేశ్ తన స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. కోర్టు రమేశ్‌కి జీవితఖైదుతో పాటు రూ.1000 జరిమానా కూడా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Similar News
News March 3, 2026
విశాఖ: బర్త్‌డే.. డెత్ డే

ఆరిలోవ హెల్త్ సిటీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు <<19282896>>మృతి చెందిన<<>> విషయం తెలిసిందే. మృతుడు విజయనగరం (D) గజపతినగరం (M) రామన్నపేటకు చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. సాయికిరణ్ ఉషోదయ జంక్షన్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం తన పుట్టినరోజు కావడంతో బైక్‌పై సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్సై ధర్మేందర్ తెలిపారు.
News March 3, 2026
ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

☛ పత్తి, వేరుశనగ చుట్టూ ఆముదపు పంటను ఎర పంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను నివారించవచ్చు. ☛ క్యాబేజీలో ఆవాల పంటను వేసి డైమండ్ బ్యాక్ మాత్‌ను నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ అలసందలు పంటలో ఆవాలును ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు మొక్కలను నాటి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.
News March 3, 2026
సంగారెడ్డిలో సదరం శిబిరాల షెడ్యూల్ విడుదల

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మార్చి నెలకు సంబంధించిన ‘సదరం’ శిబిరాల షెడ్యూల్‌ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 4, 11, 18, 25 తేదీల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని, నిర్ణీత తేదీల్లో ఉదయాన్నే ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమతో పాటు తగు ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.


