News September 12, 2025

రేపు విశాఖ రానున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా

image

కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం విశాఖ రానున్నారు. శనివారం రాత్రి 8:50కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రికి నోవాటల్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం రైల్వే గ్రౌండ్‌లో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం పలువురు స్థానిక నేతలతో సమావేశం అవుతారు. ఆదివారం సాయంత్రం 4:45కి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

Similar News

News March 19, 2026

విశాఖ: ‘​జోన్ ప్రారంభ తేదీపై స్పష్టత లేదు’

image

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభంపై స్పష్టమైన తేదీని ఇంకా నిర్ణయించలేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లోక్ సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జోన్ ఏర్పాటుకు సంబంధించిన నిధుల కేటాయింపు, భూసేకరణ, మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయని, అయితే కార్యకలాపాల ప్రారంభానికి ఇంకా కాలపరిమితి ఖరారు కాలేదని స్పష్టం చేశారు.

News March 19, 2026

విశాఖ: ప్రయాణికులకు అలర్ట్

image

విశాఖ నుంచి ప్రయాణించే పలు రైళ్లకు హరిశ్చంద్రాపురం, మందస రోడ్ స్టేషన్లలో మార్చి 20 నుంచి ప్రయోగాత్మక హాల్ట్‌లను రైల్వే బోర్డు మంజూరు చేసింది. రైలు నం 58506/58505 (విశాఖ-గుణుపూర్), 18526/18525 (విశాఖ-బ్రహ్మపూర్) ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిర్ణీత సమయాల్లో ఈ స్టేషన్లలో ఆగుతాయని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని కోరారు.

News March 19, 2026

విశాఖ: రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

image

రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా బుధవారం పరిహారం అందజేశారు. హిట్&రన్‌లో గాయపడిన నలుగురుకి రూ.2లక్షలు పరిహారం అందించామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గోపాలపట్నానికి చెందిన రవికుమార్, కంచరపాలెంకు చెందిన సత్యనారాయణ, అక్కయ్యపాలెంకు చెందిన అప్పారావు, మర్రిపాలెంకు చెందిన శంకర్రావు ఖాతాల్లో రూ.50వేలు చొప్పున జమ చేశామన్నారు. ఇప్పటి వరకు 146 మంది బాధితులకు రూ.1,15,00,000 అందించినట్లు చెప్పారు.