News September 12, 2025
HYD: ఈ మెట్రో రైలు మాకొద్దు బాబోయ్: L&T

HYDలో లక్షలాది మంది ప్రయాణికులను చేరవేస్తున్న మెట్రో రైల్ నిర్వహణ తమకు చేతకావడం లేదని.. ఖర్చులు పెరిగిపోతున్నాయని L&T కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దాదాపు రూ.5వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని.. రోజూ వచ్చే టికెట్ ఆదాయం సరిపోవడం లేదని.. ఇలా అయితే ఉద్యోగుల జీతాలు ఇచ్చుకోలేమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
Similar News
News September 12, 2025
‘TG 09 G9999’కు రూ.25.50 లక్షలు

TG: సెంటిమెంట్ కోసం కొందరు వాహనం కంటే రిజిస్ట్రేషన్ నంబర్‌కు అధికంగా వెచ్చిస్తుంటారు. HYD సెంట్రల్ జోన్ RTA ఇవాళ నిర్వహించిన వేలంలో TG09G9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ.25.50 లక్షలు పలికింది. పలు కార్పొరేట్ కంపెనీలు, సోలో బయ్యర్స్ పాల్గొనగా Hetero డ్రగ్స్ లిమిటెడ్ భారీ ధరకు ఈ నంబర్‌ను దక్కించుకుంది. ఇతర నంబర్లు రూ.1.01-6.25 లక్షల వరకు సేల్ అయ్యాయి. మొత్తంగా ఒక్క రోజే రూ.63.7 లక్షల ఆదాయం వచ్చింది.
News September 12, 2025
అనకాపల్లి, విజయనగరంలో VMRDA జోనల్ కార్యాలయాలు ప్రారంభం

పరిపాలన సౌలభ్యం కోసం అనకాపల్లి, విజయనగరంలో నిర్మించిన VMRDA జోనల్ కార్యాలయాలను ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, IAS వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విజయనగరంలో రూ.47.95 లక్షలు, అనకాపల్లిలో రూ.33.5 లక్షలతో పునఃనిర్మాణం చేసిన కార్యాలయాలు ప్రజలకు చేరువ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతులు మురళీకృష్ణ, వినయ్ కుమార్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News September 12, 2025
విజయవాడలో కరాటే జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 కరాటే జట్ల ఎంపికలు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని జిల్లా ఎస్‌జిఎఫ్. కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని కరాటే గురువులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.