News September 12, 2025

ఎన్ హెచ్-16 డీపీఆర్‌పై అనకాపల్లి ఎంపీ సమీక్ష

image

అనకాపల్లి-అన్నవరం-దివాన్ చెరువు ఎన్ హెచ్-16 విస్తరణకు సంబంధించి డీపీఆర్ తయారీకి అనకాపల్లి కలెక్టరేట్ లో శుక్రవారం కలెక్టర్,జేసీ అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల , పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లతో ఎంపీ సీఎం రమేష్ సమీక్ష నిర్వహించారు. ఈ రహదారిని ఆరు లైన్లకు విస్తరించనున్నారు. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించారు.ఎన్.హెచ్.ఏ.ఐ. ప్రాజెక్ట్ డైరెక్టర్ రోహిత్ కుమార్ పాల్గొన్నారు.

Similar News

News March 10, 2026

రేపు జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ చీఫ్ జగన్ రేపు మీడియాతో మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. వివిధ అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేసే అవకాశం ఉంది.

News March 10, 2026

ప్రజాప్రతినిధుల శిక్షణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 12న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణ గూర్చి జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ ఛైర్మెన్లు, కౌన్సిలర్లు శిక్షణ తరగతులకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99రోజుల కార్యక్రమంలో ఆయా థీమ్స్ పై ప్రజాప్రతినిధులకు శిక్షన ఇవ్వనున్నట్టు తెలిపారు.

News March 10, 2026

గుంటూరు: మరి కాసేపట్లో ముగియనున్న గడువు

image

గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణకు మరికొన్ని గంటలే మిగిలాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అర్హులైన తల్లిదండ్రులు మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల్లోపు ఉండాలి. ఎంపిక కోసం లాటరీ విధానం అమలు చేస్తారు. ఎంపికైన వారు మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాలను నిర్ధారించాలి.