News September 12, 2025

విజయవాడ: 163కి చేరిన డయేరియా కేసులు

image

విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇప్పటి వరకు మొత్తం 163 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ప్రస్తుతం 92 మంది చికిత్స పొందుతుండగా, 71 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. డయేరియా బాధితులకు ప్రభుత్వం సరైన సమయంలో సరైన చికిత్స అందిస్తుందని ఆయన వివరించారు.

Similar News

News March 13, 2026

విజయవాడ: అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లల్లో తనిఖీలు

image

విజయవాడలోని రౌడీషీటర్లపై పోలీసులు నిరంతర నిఘా పెడుతున్నారు. మాచవరం ప్రాంతంలో సీఐ వెంకటరమణ తన సిబ్బందితో గురువారం అర్ధరాత్రి రౌడీ షీటర్లు, అనుమానితుల గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రౌడీషీటర్లు తమ తమ ఇళ్లలోనే ఉన్నట్లు గుర్తించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇటువంటి ఆకస్మిక తనిఖీలు తరచుగా కొనసాగుతాయని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 13, 2026

కామారెడ్డి: రేపటి నుంచే పది పరీక్షలు

image

కామారెడ్డి జిల్లాలో 65 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలను పటిష్ఠ భద్రతల మధ్య నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 13,154 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా బాలురు 6,451 బాలికలు 6,703 మంది ఉన్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 16 వరకు ఉదయం 9గం.నుంచి 12.30గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్స్ చూపించి పరీక్షా కేంద్రం దగ్గర్లోకి ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు.

News March 13, 2026

పల్నాడు: గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక నంబర్

image

పల్నాడు జిల్లాలో LPG కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ సంజన సింహ గురువారం తెలిపారు. గ్యాస్ నిల్వలు తగ్గుతాయనే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ (08647-252999) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరాలకు తగిన విధంగా సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని తెలిపారు.