News September 12, 2025
KPHB: ఆత్మహత్యాయత్నం కేసులో గృహిణి రిమాండ్

KPHB 6వ ఫేజ్‌లో దంపతులు సూసైడ్ అటెంప్ట్ కేసు గత నెల 30న సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిలో భర్త రామకృష్ణారెడ్డి చనిపోగా భార్య రమ్యకృష్ణ చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పుల బాధ తాళలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించడం, భర్తను కత్తితో గాయపరచగా రక్తస్రాపమై మృతి చెందాడు. భార్య చనిపోవడానికి ప్రయత్నించగా భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
Similar News
News March 22, 2026
నంద్యాల: పొంచి ఉన్న ప్రమాదం!

నంద్యాల జిల్లాలో పలు బ్రిడ్జిలు, కల్వర్టుల రక్షణ గోడులు శిథిలావస్థకు చేసుకొని ప్రమాదకరంగా మారాయి. వెలుగోడు మండలం రేగడగూడూరుకు వెళ్లే రహదారిలో అబ్దుల్లాపురం సమీపాన ఉన్న వంకపై ఏర్పాటు చేసిన కల్వర్టుకు సైడ్ వాల్ లేకపోవడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో ఆదమరిస్తే వాహనదారులు ప్రమాదాలకు గురవ్వాల్సిందే. అధికారులు స్పందించి కల్వర్టుపై సైడ్ వాల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
News March 22, 2026
గద్దర్ అవార్డులకు మంత్రి దూరం: రాజకీయ చర్చ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘గద్దర్ సినీ అవార్డుల’ ప్రదానోత్సవానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నగరంలోనే ఉన్నప్పటికీ ఆయన రాకపోవడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన శాఖలో మరో నేత జోక్యం పెరగడం లేదా తనను ముఖ్య అతిథిగా కాకుండా విశిష్ట అతిథిగా ఆహ్వానించడంపై ఆయన అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
News March 22, 2026
కడప: సీఐ అశోక్‌రెడ్డిపై ‘నాన్ బెయిలబుల్’ కేసు..!

గతంలో చిన్నచౌకు, చింతకొమ్మదిన్నె స్టేషన్లలో సీఐగా పనిచేసిన అశోక్‌రెడ్డిపై నమోదైన నాన్ బెయిలబుల్ కేసు పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆస్తుల సెటిల్మెంట్ల కోసం తనను బెదిరించడమే కాకుండా, రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ అనంతపురానికి చెందిన బాధితుడు ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చింతకొమ్మదిన్నె పోలీసులు సీఐపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు.


