News September 12, 2025
సికింద్రాబాద్: గాంధీలో సేవలు ఇకనైనా గాడిన పడేనా?

గాంధీ ఆస్పత్రి అంటేనే తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు ఓ ధైర్యం.. అలాంటిది ఇటీవల ఇందులో సరైన సేవలందడం లేదని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనంతటికీ కారణం సూపరింటెండెంట్ డా.రాజకుమారి నిర్లక్ష్య వైఖరే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ప్రభుత్వం ఆమె స్థానంలో అడిషనల్ DME డా.వాణి నూతన సూపరింటెండెంట్‌ను నియమించింది. ఇప్పుడైనా సేవలు మెరుగుపడతాయేమోనని నగర వాసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
Similar News
News September 12, 2025
HYD: మిలాద్ ఉన్ నబి వేడుకల్లో డీజేలు నిషేధం

చార్మినార్ PS పరిధిలోని సనా గార్డెన్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీపీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ఆర్&బీ విభాగాల అధికారులు, సుమారు 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. డీజేలు, పటాకులు నిషేధం అని డీసీపీ స్పష్టం చేస్తూ, కార్యక్రమాలు ప్రశాంతంగా, సమయానికి ముగించాలని తెలిపారు.
News September 12, 2025
GHMC, హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

GHMC, హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర రూ.వంద కోట్ల విలువైన స్థలానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హౌసింగ్ సొసైటీకి ఆదేశలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
News September 12, 2025
గాంధీ ఆస్పత్రిలో బాధ్యతలు స్వీకరించిన డా.వాణి

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా అడిషనల్ DME ప్రొ.డా.వాణి కాసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు పని చేసిన డా.రాజకుమారి గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా డా.వాణి మాట్లాడుతూ.. గాంధీలో సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.