News September 12, 2025

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్

image

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను బదిలీ చేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఏపీ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి తన వంతు కృషి చేశారు. అయితే ఈయనను ఎక్కడికి బదిలీ చేశారో తెలియాల్సి ఉంది.

Similar News

News September 12, 2025

ఆందోళన కలిగిస్తున్న గుండెపోటు మరణాలు!

image

గుండెపోటుతో సాధారణ ప్రజలే కాదు డాక్టర్లూ మరణిస్తున్నారు. ఆర్మీలో వైద్యుడిగా సేవలందిస్తోన్న మేజర్ విజయ్ కుమార్ (మధ్యప్రదేశ్) కూర్చున్న చోటే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కారులో చాలాసేపు కదలకుండా కూర్చోవడం గమనించి పాదచారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు. ఇటీవలే చెన్నైలోనూ ఓ కార్డియాలజిస్ట్ కూడా గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.

News September 12, 2025

పెద్దపల్లి: ‘బైపాస్ రోడ్డుకు భూములు ఇస్తాం’

image

గోదావరి తీరంపై ప్రతిపాదిత మంచిర్యాల-పెద్దపల్లి వంతెన నిర్మాణ బైపాస్ రహదారి మార్గాన్ని నూతనంగా మళ్లించడం కాకుండా, ప్రస్తుతం ఉన్న రహదారి ద్వారానే తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. తమ భూములను స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. ఇలా చేస్తే మంథని బస్ డిపో వరకు రహదారి చేరి పట్టణం, వ్యాపారాలు, ఆసుపత్రులు ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తాయని మంత్రి శ్రీధర్ బాబుకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.

News September 12, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్..!

image

> జనగామ: ఇందిరమ్మ ఇళ్ల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు: కలెక్టర్
> రైతులకు సరిపడా యూరియా అందించాలి: ఎర్రబెల్లి
> పాలకుర్తిలో యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు
> స్టేషన్ ఘనపూర్: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల నిరసన
> చిల్పూర్: కస్తూర్బా విద్యాలయంలో ఎంపీడీవో తనిఖీలు
> జనగామ ఆర్టీసీ డిపో నుంచి కొత్త టూర్ ప్యాకేజీలు