News September 12, 2025
నత్తనడకన రామాయపట్నం పోర్టు పనులు!

రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏడాదికి 138 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యంగా 19 బెర్తులతో కూడిన రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. రూ.3,736 కోట్లతో 4 బెర్తుల తొలిదశ నిర్మాణ పనులకు 2022 జూన్‌లో అప్పటి CM జగన్ భూమిపూజ చేశారు. 2024 జనవరిలో తొలి కార్గో షిప్ వచ్చేలా అప్పట్లో పనులు చురుకుగా సాగాయి. ప్రభుత్వం మారడంతో 6 నెలల పాటు పనులు స్తంభించాయి.
Similar News
News March 7, 2026
నెల్లూరు: బాలికకు మాయమాటలు చెప్పి..

VK పాడు(M)కు చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు SI రఘునాథ్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు లవ్ చేస్తున్నానని చెప్పి యువకుడు తీసుకెళ్లిన ఘటనపై పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిన్న ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని ఉదయగిరి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. బాలికను పేరెంట్స్‌కు అప్పగించారు.
News March 7, 2026
నెల్లూరు మున్సిపల్ అధికారులు వార్నింగ్

నెల్లూరు నగరంలో రూ.44 కోట్ల పన్ను బకాయిలు పేరుకుపోవడంతో మున్సిపల్ అధికారులు సీరియస్ అయ్యారు. మార్చి 31 డెడ్ లైన్ కావడంతో, సుమారు 14,300 మంది మొండి బకాయిదారులకు లోక్ అదాలత్ నోటీసులు జారీ చేస్తున్నారు. గత ఏడాదిలా 50% రాయితీ వస్తుందని ఆశించి పన్ను ఆపేయవద్దని, అలా చేస్తే ఇంటి నల్లా కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారీ బకాయిలు ఉన్న హోటళ్లు, మాల్స్, ఇండస్ట్రీలపై నిఘా పెట్టారు.
News March 7, 2026
నెల్లూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ.16 లక్షల నగదు చోరీ

కొండాయపాలెం నందనవనానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ రెడ్డి బీరువాలో ఉన్న రూ. 16.50 లక్షల నగదు, 55 గ్రాముల బంగారు చోరీకి గురైందని వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అసిస్టెంట్ శ్రీనివాసులు అనే వ్యక్తికి నగదుబీరువాలో ఉంచమని ఇచ్చారు. అనంతరం నిద్రపోయే లేచి చూడగా బీరువాలో నగదు, బంగారు, పార్కింగ్‌లో ఉన్న బైక్ కనపడలేదని అన్నారు. తన అసిస్టెంట్‌పై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు.


