News September 12, 2025
నాలెడ్జ్ ఎకానమీగా అమరావతి: చంద్రబాబు

AP: రాబోయే మూడేళ్లలో అమరావతిలో రూ.50వేల కోట్ల పనులు పూర్తవుతాయని సీఎం చంద్రబాబు వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో చెప్పారు. అమరావతిని నాలెడ్జ్ ఎకానమీగా, క్వాంటం సిటీగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. పోలవరం రాష్ట్రానికి ఎంతో కీలకమని, దాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 740 కి.మీ దూరం కృష్ణమ్మను తరలించి రాయలసీమకు, కుప్పానికి నీరు అందించామని వివరించారు.
Similar News
News March 26, 2026
వరల్డ్ నంబర్ వన్ లీడర్ మోదీ: 68% రేటింగ్‌తో మళ్లీ టాప్!

USకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్’ లేటెస్ట్ సర్వే ప్రకారం 68% అప్రూవల్ రేటింగ్‌తో మోదీ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్‌గా నిలిచారు. రెండో స్థానంలో స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ పార్మెలిన్, సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ (62%) ఉన్నారు. US అధ్యక్షుడు ట్రంప్ (39%), బ్రిటన్ PM కీర్ స్టార్మర్ (24%) మోదీ కంటే వెనుకబడ్డారు. అలాగే నెహ్రూ తర్వాత అత్యధిక కాలం PMగా ఉన్న వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు.
News March 26, 2026
ట్రంప్ నరకం చూపిస్తారు: వైబ్ హౌస్

ఇరాన్ తన ఓటమిని అంగీకరించకపోతే ఆ దేశాన్ని ఘోరంగా దెబ్బకొడతామని అమెరికా హెచ్చరించింది. ట్రంప్ అస్సలు తగ్గరని.. నరకాన్ని చూపిస్తారని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధం నాలుగో వారంలో ఉండగా అగ్రరాజ్యం తన లక్ష్యాలకు చాలా దగ్గరలో ఉందని వెల్లడించింది. ఒకవైపు పాకిస్థాన్, తుర్కియే మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నా ఇరాన్ లొంగిపోవడమే మార్గమని వాషింగ్టన్ స్పష్టం చేస్తోంది.
News March 26, 2026
రేపు రామ్ చరణ్ బర్త్‌డే.. ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ‘పెద్ది’ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ రాబోతోంది. ‘Mass Rampage Begins’ అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ SMను షేక్ చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. రేపు రాబోయే అప్‌డేట్‌లో టీజర్ లేదా సాంగ్ గ్లింప్స్ ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


