News September 12, 2025

కియా కోసం ఏడాదిలో జలాశయం నిర్మించాం: సీఎం

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనేక అనుకూలతలు ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు Way2News కాన్‌క్లేవ్‌లో తెలిపారు. కియా మోటార్స్‌ కోసం గొల్లపల్లి జలాశయాన్ని ఏడాదిలోనే నిర్మించామని చెప్పారు. ఈ జలాశయం ఏర్పాటుతో కియా పరిశ్రమ అవసరాలు తీరాయి, ఆ పరిశ్రమ రాకతో ఎందరికో ఉపాధి దొరికిందని అన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని స్పష్టం చేశారు.

Similar News

News March 4, 2026

యూరియా ఉత్పత్తి తగ్గుదల.. పెరగనున్న రేట్లు?

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కారణంగా ఖతర్‌లో LNG <<19281702>>ఉత్పత్తి<<>> నిలిచిపోవడంతో ఇండియాలో యూరియా ప్రొడక్షన్‌‌ను కంపెనీలు తగ్గిస్తున్నాయి. యూరియా ఉత్పత్తికి LNG ప్రైమరీ ఫీడ్‌స్టాక్. ఇది ఎనర్జీ సోర్స్‌గానే కాకుండా ఎరువుల తయారీ ప్రక్రియలోనూ కీలకమైన ఇన్‌పుట్. యూరియా కొరత ఏర్పడితే రేట్లు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

News March 4, 2026

BNGR: హాస్టళ్లలో ఇక ‘ఫేషియల్’ హాజరు..! .

image

జిల్లాలోని 85 సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇకపై Facial Recognition (FRS) ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. SC, ST, BC, మైనార్టీ, కేజీబీవీల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకా రెడ్డి పాల్గొన్నారు.

News March 4, 2026

ఫిన్+టిమ్= అదిరెన్.. T20WCలో సరికొత్త చరిత్ర

image

T20WC-2026లో కివీస్ ఓపెనర్లు <<19299520>>ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్<<>> రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఈ ఎడిషన్‌లో 10.93 రన్ రేట్‌తో 463 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. T20WC హిస్టరీలో పరుగులు, రన్ రేట్ పరంగా ఇవే అత్యధికం. 2024లో ఇబ్రహీం-గుర్బాజ్ 7.6 RRతో 446 రన్స్, 2021లో బాబర్-రిజ్వాన్ 7.33 RRతో 411 పరుగులు, 2022లో బట్లర్-హేల్స్ 9.2 RRతో 368 రన్స్, 2007లో గిల్‌క్రిస్ట్-హెడెన్ 8.93 RRతో 335 పరుగులు చేశారు.