News September 12, 2025
వనపర్తి: పాన్‌గల్‌లోనే అత్యధిక వర్షపాతం!

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా పానగల్ మండలంలో 48.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పెద్దమందడిలో 45.0 మిల్లీమీటర్లు, వనపర్తిలో 44.6, గోపాల్‌పేటలో 35.7, కొత్తకోటలో 34.2, పెబ్బేరులో 30.7, శ్రీరంగాపూర్‌లో 28.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీపీఓ నివేదికలో పేర్కొన్నారు. ఈ వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 4, 2026
GNT: జగన్‌పై మాటల దాడి చేసిన అచ్చెన్నాయుడు

మాజీ సీఎం జగన్ క్రైస్తవుడు కాబట్టే దేవాలయాల ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం శాసన మండలిలో జగన్ పై తనదైన శైలిలో మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. జీసెస్ ఫోటో సాక్షిలో తప్పుగా ప్రచురించినందుకు క్రైస్తవ సోదరులకు శతకోటి క్షమాపణలు చెప్పిన జగన్, TTD లడ్డును కల్తీ చేసిన విషయంలో క్షమాపణ చెప్పకపోగా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
News March 4, 2026
జాన్సెన్ దూకుడు.. SA స్కోర్ ఎంతంటే?

T20WC: NZతో జరుగుతున్న సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. కివీస్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేశారు. మార్క్రమ్ 18, డికాక్ 10, బ్రెవిస్ 34, మిల్లర్ 6, స్టబ్స్ 29 రన్స్ చేశారు. రచిన్ రవీంద్ర, మెక్‌కొంచి, హెన్రీ రెండేసి వికెట్లు తీశారు. ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ 30 బంతుల్లోనే 55* రన్స్ చేశారు. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో విరుచుకుపడ్డారు.
News March 4, 2026
బాపట్ల: ‘క్రమబద్ధమైన ప్రాక్టికల్స్ నిర్వహించాలి’

బాపట్లలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల కొరతతో బాలికల పాఠశాల విద్యార్థినీలు ఇబ్బందులు పడుతున్న విషయంపై ఆరా తీశారు. నిలిచిపోయిన అదనపు గదుల నిర్మాణాలపై విద్యాశాఖ అధికారులతో ఫోన్‌లో చర్చించారు. మౌలిక సదుపాయాలు కల్పించి గదులను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన బోధన, క్రమబద్ధమైన ప్రాక్టికల్స్ నిర్వహించాలని సూచించారు.


