News September 12, 2025
మెరుగైన వైద్య సేవలు అందించాలి: జగిత్యాల కలెక్టర్

ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కథలాపూర్ మండలం అంబర్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను, హాజరును పరిశీలించారు. వైద్యులు సమయపాలన పాటించాలని, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇంటింటి ఫీవర్ సర్వే చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ తదితరులు ఉన్నారు.
Similar News
News September 13, 2025
గోదావరిఖని: దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు వినతి

గోదావరిఖనిలోని కోదండ రామాలయ జూనియర్ అసిస్టెంట్, కార్యనిర్వహణ అధికారిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు ఎల్‌బీనగర్‌కు చెందిన మామిడి కుమారస్వామి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని వీరు అక్రమంగా వారి బ్యాంక్ ఖాతాల్లో బదిలీ చేసుకుంటున్నారని తెలిపారు. భక్తులతో కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
News September 13, 2025
విదేశీ ఉపాధి అవకాశాల వినియోగంపై దృష్టి పెట్టాలి: పెద్దపల్లి కలెక్టర్

TG iPASS కింద వచ్చిన ప్రతి దరఖాస్తు నిర్దిష్ట గడువులో అనుమతులు ఇవ్వాలని, ఫైల్ మూమెంట్‌లో ఆలస్యం లేకుండా అధికారులు టైమ్ బౌండ్ విధానంలో పనిచేయాలని PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఈరోజు పరిశ్రమలు, DEET అధికారులతో సమావేశం నిర్వహించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, టామ్‌కామ్ ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాల వినియోగంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల అధికారి కీర్తి కాంత్ పాల్గొన్నారు.
News September 13, 2025
ధర్మారం: ప్రిన్సిపల్, విద్యార్థులకు కలెక్టర్ అభినందన

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్, పలువురు విద్యార్థులను కలెక్టర్ శ్రీహర్ష శుక్రవారం కలెక్టరేట్‌లో అభినందించారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు విద్యార్థులతో మిడ్ డే మీల్స్ చేయడం, భోజన సమయంలో గ్రీన్ FM రేడియో నిర్వహణ, ప్లాస్టిక్ రహిత పాఠశాల, ఫొటో విత్ మంత్లీ మ్యాగజైన్, ప్లే ఫర్ ఆల్ కార్యక్రమాల నిర్వహణ, హాజరు, జాయినింగ్ శాతం పెంపొందించడంపై కలెక్టర్ అభినందించినట్లు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు.