News September 12, 2025
రైతులతో మాట్లాడుతూ రాజధానిని విస్తరిస్తాం: చంద్రబాబు

AP: అమరావతి రెండో విడత భూసేకరణపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 33వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. వారిని ఆదుకుంటాం. విమానాశ్రయం, పెద్దపెద్ద సంస్థలు రావాలి. నేను ఇక్కడే ఆగిపోతే అభివృద్ధి నిలిచిపోతుంది. భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్టులు కావాలంటే ఇంకా ల్యాండ్ కావాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ రాజధానిని విస్తరిస్తాం’ అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో చెప్పారు.
Similar News
News March 26, 2026
మార్కాపురం ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని అన్నారు. జిల్లా అధికారులతో మాట్లాడిన ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News March 26, 2026
రోజూ కాసేపు హాయిగా నవ్వితే..

నవ్వు బెస్ట్ మెడిసిన్ అంటున్నారు వైద్యులు. రోజూ కాసేపు మనస్ఫూర్తిగా నవ్వితే ఫిజికల్, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడి, కోపం తగ్గుతాయంటున్నారు. ‘10-15ని.లు నవ్వితే 40 క్యాలరీలు ఖర్చవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్లయిన ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి, రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. గుండె సమస్యలు, BP తగ్గుతాయి. క్యాన్సర్‌పై పోరాటంలోనూ సాయపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt
News March 26, 2026
BREAKING: పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,46,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.1,34,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది.


