News September 12, 2025
2, 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి: సీఎం

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘జగన్ ఐదేళ్లలో ఎన్ని కాలేజీలు కట్టారు? కట్టకపోయినా కట్టానని ప్రచారం చేసుకున్నారు. మేము PPP విధానం తెచ్చినా కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే రన్ అవుతాయి. ఓపీ ఫ్రీగా ఉంటుంది. రెండు, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఆపరేట్ అవుతాయి. ఓపెన్ కాంపిటీషన్‌లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఎక్కువగా ఉంటాయి’ అని Way2News కాన్‌క్లేవ్‌లో తెలిపారు.
Similar News
News September 12, 2025
ఆందోళన కలిగిస్తున్న గుండెపోటు మరణాలు!

గుండెపోటుతో సాధారణ ప్రజలే కాదు డాక్టర్లూ మరణిస్తున్నారు. ఆర్మీలో వైద్యుడిగా సేవలందిస్తోన్న మేజర్ విజయ్ కుమార్ (మధ్యప్రదేశ్) కూర్చున్న చోటే చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కారులో చాలాసేపు కదలకుండా కూర్చోవడం గమనించి పాదచారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు. ఇటీవలే చెన్నైలోనూ ఓ కార్డియాలజిస్ట్ కూడా గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.
News September 12, 2025
ట్రంప్ సన్నిహితుడి హత్య.. ఎందుకు చంపాడంటే?

ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ కిర్క్‌ను గన్‌తో కాల్చి చంపిన కేసులో నిందితుడు టేలర్ రాబిన్‌సన్(22)ను US పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు విడుదల చేసిన ఫొటోల్లో ఉన్నది టేలరేనని అతడి తండ్రి గుర్తించి లొంగిపోమని చెప్పాడు. ఓ పాస్టర్‌ను సాయం కోరగా ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ‘కిర్క్ పొలిటికల్, విద్వేష ప్రసంగాలు చేస్తున్నాడు’ అని హత్యకు ముందు రోజు రాత్రి టేలర్ ఇంట్లో చెప్పినట్లు అతడి తండ్రి తెలిపారు.
News September 12, 2025
ఎంటర్‌పెన్యూర్‌షిప్‌తోనే రాష్ట్రాభివృద్ధి: వ్యాపారవేత్తలు

AP: వ్యాపార రంగం వచ్చే పదేళ్లలో ఎలాంటి పురోగతిని చూడబోతోంది అనే అంశంపై Way2News Conclaveలో తెనాలి డబుల్ హార్స్ MD శ్యాంప్రసాద్, సోనోవిజన్ MD భాస్కర్ మూర్తి, GVమాల్ MD ఉమామహేశ్వర్, విజ్ఞాన్ విద్యా సంస్థల ఛైర్మన్ రత్తయ్య తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉద్యోగాలు కాకుండా సొంత వ్యాపారంతోనే వ్యక్తిగత, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వారు సూచించారు. ఎవరైనా టెక్నాలజీని వ్యాపారంలో భాగం చేసుకోవాలని సూచించారు.