News September 12, 2025
అభివృద్ధి కోసమే PPP మోడల్స్: CM చంద్రబాబు

AP: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరముందని CM చంద్రబాబు Way2News Conclaveలో పేర్కొన్నారు. ‘అభివృద్ధి కోసమే PPP మోడల్స్ అనుసరిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇవే అమలవుతున్నాయి. దీంతో సంపద సృష్టి జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పథకాలు అమలు చేసే శక్తి వస్తుంది. అందుకే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్లం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం’ అని తెలిపారు.
Similar News
News March 27, 2026
ఇజ్రాయెల్‌కు పాకిస్థాన్ వార్నింగ్

టెహ్రాన్(ఇరాన్)లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో అమెరికా-ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై పాక్ తీవ్రంగా స్పందించింది. ‘మాది ఖతర్ లాంటి దేశం కాదని ఇజ్రాయెల్ గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా మా దౌత్యవేత్తలకు హాని జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించింది. కాగా ఈ దాడుల్లో దౌత్యవేత్తలకు ఎలాంటి హాని కలగలేదు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి.
News March 27, 2026
వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్

వాట్సాప్ సూపర్ ఫీచర్‌ను ప్రకటించింది. వ్యక్తిగత, గ్రూప్ చాట్స్(ఫొటోలు, వీడియోలు సహా), కాల్ హిస్టరీ, కమ్యూనిటీస్, వాట్సాప్ ఛానల్ అప్డేట్స్‌ను మరో ప్లాట్‌ఫామ్‌లోకి మార్చుకొనే వీలు కల్పించింది. అంటే మరో వాట్సాప్/ఇతర మెసేజింగ్ యాప్స్‌కు సమాచారాన్ని బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల స్టోరేజీ ఇబ్బంది ఉండదు. ఇకపై ఐఫోన్‌లోనూ 2 అకౌంట్లు వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ మధ్య చాట్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
News March 27, 2026
పెళ్లిపై స్పందించిన సాయి పల్లవి

తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు హీరోయిన్ సాయి పల్లవి ఫుల్ స్టాప్ పెట్టారు. ఓ ప్రోగ్రామ్‌లో జర్నలిస్టులు పెళ్లి గురించి అడగ్గా ఆమె స్పందించారు. ‘ప్రస్తుతం నా పూర్తి దృష్టి కెరీర్‌పైనే ఉంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదు. నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నా’ అని చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఏక్ దిన్’ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు.


