News September 12, 2025

ADB: ‘నూతన భవనాలు ఏర్పాటు చేయాలి’

image

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు శిధిలావస్థకు వచ్చిన భవనాలను పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులు నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గేడం కేశవ్ కోరారు. శుక్రవారం ఈ విషయమై కలెక్టర్ రాజర్షిషాకు వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు అరకొర వసతులతో నడుస్తున్నాయని.. వెంటనే మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు.

Similar News

News March 26, 2026

ADB: ​రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల అడ్డుకట్టకు పోలీసులు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వాహనదారుల రక్షణ కోసం స్పీడ్ బ్రేకర్లకు రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ పెయింటింగ్ వేయించారు. ప్రతి ప్రాణం విలువైనదని, వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. భద్రతా చర్యలు చేపడుతున్న పోలీసుల పనితీరును ప్రజలు అభినందిస్తున్నారు.

News March 26, 2026

ADB: 17 బాల్యవివాహాలు నిలిపివేత

image

ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ అక్క కార్యక్రమం ప్రజల విశేష ఆదరణ పొందుతోంది. గత నెలలో 60 గ్రామాల్లో 131 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 45 పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించారు. మొత్తం 25 ఫిర్యాదులు స్వీకరించి వేధింపులపై చర్యలు తీసుకున్నారు. చిన్నారుల సమాచారంతో 17 బాల్యవివాహాలు నిలిపివేశారు. ఉత్తమ సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.

News March 26, 2026

ADB: పదికి 4 , ఇంటర్‌కు 3 పరీక్ష కేంద్రాలు

image

ఓపెన్ స్కూల్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో పదో తరగతికి 4, ఇంటర్‌కు 3 కేంద్రాలు కేటాయించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీటీవీ కెమెరాల నిఘా ఉండాలని, తాగునీరు, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పరీక్షా పత్రాల రవాణా, భద్రతకోసం పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని, విద్యార్థుల కోసం ఉదయం 7 నుండే బస్సులు నడపాలన్నారు.