News September 12, 2025
ADB: ‘కాలపరిమితి లోపల పరిష్కారం చూపాలి’

రెవెన్యుకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి దరఖాస్తుదారుని సమస్య పట్ల పరిష్కారం చూపాలని సంబధిత అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సీఎం పైలెట్ ప్రజావాణి జిల్లా స్థాయి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అప్పీల్ దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. పరిష్కారానికి వారం, పక్షం, నెల రోజుల్లో దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు.
Similar News
News March 18, 2026
ADB: గ్రామాలను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా మార్చాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ‘మూడవ కన్ను’లా పనిచేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటి ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
News March 18, 2026
ADB: ఖోడద్ అభివృద్ధికి ఉద్యోగుల కృషి భేష్- కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామ అభివృద్ధికి ఆ గ్రామానికి చెందిన ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. సొంత ప్రాంతంపై మమకారంతో విజ్ఞానాన్ని పంచేందుకు లైబ్రరీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు.