News September 12, 2025

ఆదిలాబాద్: ‘మహాసభలకు అనుమతి ఇవ్వండి’

image

అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా నాలుగో మహాసభలు ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి దేవేందర్ తెలిపారు. మహాసభలకు అంగన్వాడీ ఉద్యోగులకు అనుమతి ఇవ్వాలని శుక్రవారం ఆదిలాబాద్ సీడీపీఓ మిల్కాకు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ ఉద్యోగులు మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News March 10, 2026

ADB: నేటి INTER పరీక్షకు 385 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. మొత్తం 8,520 మంది విద్యార్థులకు గాను 8,135 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 292 మంది, ఒకేషనల్ విభాగంలో 93 మంది కలిపి మొత్తం 385 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News March 10, 2026

ఆదిలాబాద్ సింగం.. ONE YEAR COMPLETE

image

ఆదిలాబాద్ జిల్లా SPగా అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాదయింది. ఈ ఏడాది కాలంలో ప్రజలు సేవలందించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపారు. క్రైంను అదుపులోపెట్టి మహిళలకు అండగా ఉంటూ దోపిడీదారుల పాలిట సింహ స్వప్నంలా మారారు. శాఖలో మార్పులు, కట్టుదిట్టమైన భద్రత ఉంటే ఇలాంటి ఎస్పీనే ఉండాలంటూ ఆదిలాబాద్ కా షేర్, సింగం అంటూ ప్రజల నుంచి మన్ననలు పొందారు.

News March 9, 2026

ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షకు.. 527 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.