News September 12, 2025
ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.. ప్రజలకు సీఎం పిలుపు

AP: ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘పోషకాహారం తినాలి. రోజూ గంట వ్యాయామం చేయాలి. రాత్రి వేళల్లో వెంటనే నిద్రపోవాలి. నా కుటుంబానికి హెరిటేజ్ ద్వారా ఆదాయం వస్తుంది. అందుకే నాకు ఎలాంటి టెన్షన్ లేదు. పూర్తి దృష్టి ప్రజలపైనే ఉంది. రాత్రి వేళ ప్రశాంతంగా నిద్ర పడుతుంది. P-4తో పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడం నా జీవిత ఆశయం’ అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో పేర్కొన్నారు.
Similar News
News September 13, 2025
భవనం గుండా ఫ్లైఓవర్.. ఎక్కడంటే?

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉంటాఖానా అశోక్ చౌక్ వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ చర్చనీయాంశమవుతోంది. ఫ్లైఓవర్‌ను ఏకంగా నివాస భవనం గుండా తీసుకెళ్లడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. జవాబుదారీతనం లేకపోవడంతోనే ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలోనూ ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన విషయం తెలిసిందే.
News September 13, 2025
ట్యాబ్లెట్ వేసుకోగానే నొప్పి ఎలా తగ్గుతుందంటే?

శరీరంలో ప్రతి మందుకీ ప్రత్యేకమైన గ్రాహకాలు(రిసెప్టార్లు) ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘పేగులు, రక్తంలో కలిసి కాలేయం గుండా వెళ్లినప్పుడు మందు కొంత కరుగుతుంది. మిగిలినది గుండెకు చేరి అక్కడి నుంచి శరీరమంతా చేరుతుంది. ఒళ్లంతా వెళ్లినా పనిచేయాల్సిన గ్రాహకాలు కొన్ని భాగాల్లోనే ఉంటాయి. ఉదా.. పెయిన్ కిల్లర్ మందు మెదడులోని ఓపియాయిడ్ గ్రాహకాలను ఉత్తేజం చేసి నొప్పిని తగ్గేలా చేస్తుంది’ అని పేర్కొన్నారు.
News September 13, 2025
పసికూనపైనా పాక్ చెత్త ప్రదర్శన!

ఆసియా కప్ 2025లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అంతంత మాత్రం ప్రదర్శన చేసి అబాసు పాలవుతోంది. నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 7 వికెట్ల నష్టానికి 160 పరుగులే చేసింది. మహ్మద్ హ్యారిస్(66), ఫర్హాన్(29), ఫకర్ జమాన్(23) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ సల్మాన్ అఘా, ఓపెనర్ అయూబ్ గోల్డెన్ డక్ కావడం గమనార్హం. ఒమన్ బౌలర్లలో ఫైజల్, ఖలీమ్‌లకు చెరో 3 వికెట్లు, మహ్మద్ నదీమ్ ఒక వికెట్ తీశారు.