News September 12, 2025

ఆదిలాబాద్ : ఐటీఐల్లో వాక్ ఇన్ అడ్మిషన్లు

image

ఐటీఐ, ఏటీసీలో చేరేందుకు మరొక అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆగస్టు 30 వరకు అడ్మిషన్ గడువు ఉండగా సెప్టెంబర్ 30వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటికే 1వ, 2వ, 3వ దశలలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ వాక్-ఇన్ అడ్మిషన్లలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT.

Similar News

News March 12, 2026

ADB: ఉచిత శిక్షణ.. APPLY NOW

image

టాస్క్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సీ, జావా, పైథాన్, వెబ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. గ్రాడ్యుయేట్లు, ఫైనలియర్ విద్యార్థులు అర్హులు. మార్చి 16లోగా ఆధార్, పాన్ కార్డ్, సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 9502786438 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

News March 12, 2026

ADB: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అశోక్

image

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆదిలాబాద్ జిల్లా నుంచి అశోక్ ముస్తాపూరేను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నియమించారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి అశోక్ ముస్తాపూరే హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తరఫున ప్రజల సమస్యలపై గళం వినిపిస్తూ, తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

News March 12, 2026

కేంద్ర మంత్రి గడ్కరీతో ఆదిలాబాద్ ఎంపీ భేటీ

image

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భీంపూర్, అర్లి కరంజీ మీదుగా మహూర్ వరకు NH-44 (బోరాజ్)ను అప్‌గ్రేడ్ చేయడం, భీంపూర్-కరంజీ రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు మావాలా నుంచి చందా వరకు ఉన్న పాత NH-7 విస్తరణ అభివృద్ధి, ఉపస్నాల వరకు NH-44ను నాలుగు లైన్లుగా మార్చడం గురించి చర్చించారు. చర్యలకు మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.