News September 12, 2025
MNCL: తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీలో చేరిక

తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీలో శుక్రవారం పలువురు చేరారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి బీసీ జేఏసీ జిల్లా ఇన్‌ఛార్జ్ మహేష్ వర్మ కండువా కప్పి ఆహ్వానించారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రానున్న బీసీ పార్టీలో చేరేందుకు వివిధ పార్టీల కీలక నాయకులు సిద్ధంగా ఉన్నారని మహేష్ తెలిపారు. ఈ నెల 17న బీసీల పార్టీ ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News September 13, 2025
పెద్దపల్లి: స్వచ్ఛత హి సేవ 2025 పోస్టర్ ఆవిష్కరణ

సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష స్వచ్ఛత హి సేవ 2025 పోస్టర్‌ను ఈరోజు ఆవిష్కరించారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, DPO వీర బుచ్చయ్య, హౌసింగ్ పీడీ రాజేశ్వర్ రావు, DWO వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
News September 13, 2025
ట్యాబ్లెట్ వేసుకోగానే నొప్పి ఎలా తగ్గుతుందంటే?

శరీరంలో ప్రతి మందుకీ ప్రత్యేకమైన గ్రాహకాలు(రిసెప్టార్లు) ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘పేగులు, రక్తంలో కలిసి కాలేయం గుండా వెళ్లినప్పుడు మందు కొంత కరుగుతుంది. మిగిలినది గుండెకు చేరి అక్కడి నుంచి శరీరమంతా చేరుతుంది. ఒళ్లంతా వెళ్లినా పనిచేయాల్సిన గ్రాహకాలు కొన్ని భాగాల్లోనే ఉంటాయి. ఉదా.. పెయిన్ కిల్లర్ మందు మెదడులోని ఓపియాయిడ్ గ్రాహకాలను ఉత్తేజం చేసి నొప్పిని తగ్గేలా చేస్తుంది’ అని పేర్కొన్నారు.
News September 13, 2025
పెన్‌పహాడ్: బ్యాంకు ఉద్యోగికి బదిలీ వీడ్కోలు సన్మానం

పెన్‌పహాడ్‌లోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో క్యాషియర్‌గా సేవలందించి బదిలీపై వెళ్తున్న బ్యాంకు ఉద్యోగి బి.ప్రశాంత్‌ను బ్యాంకు మేనేజర్ ప్రమోద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ప్రశాంత్ మండల ప్రజలకు ఉత్తమ సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నారని బ్యాంకు మేనేజర్ ప్రమోద్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ సేవలందించిన ప్రజల మన్ననలు పొందాలన్నారు.