News September 12, 2025

రేవులపల్లి-నందిమల్ల మధ్య హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలి..!

image

ధరూర్ మండలం రేవులపల్లి, నందిమల్ల మధ్య జూరాల ప్రాజెక్ట్ దిగువన హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మించాలని రేవులపల్లి అఖిలపక్ష కమిటీ కోరింది. బుధవారం కమిటీ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం ఇచ్చారు. రేవులపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించినప్పటికీ.. ఇటీవల కొత్తపల్లి-జూరాల మధ్య నిర్మించే యత్నం చేస్తున్నారని దానిని విరమించుకోవాలన్నారు.

Similar News

News March 22, 2026

భద్రాద్రి ట్రస్టు బోర్డుపై వీడని సందిగ్ధత!

image

భద్రాద్రి రామాలయ ట్రస్టు బోర్డు ఏర్పాటు దశాబ్ద కాలంగా వాయిదా పడుతూనే ఉంది. ఏటా రూ. 50కోట్లకు పైగా ఆదాయం వచ్చే ఈ ఆలయానికి బోర్డు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చినా, ఆశావహులు భారీగా ఉండటంతో ప్రక్రియ నిలిచిపోయింది. 27న శ్రీరామనవమికి CM రేవంత్ రానున్న నేపథ్యంలో, ఈసారైనా ట్రస్టు బోర్డుపై స్పష్టత వస్తుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

News March 22, 2026

జనగామ: ఎంపిక చేసిన అంగన్వాడీలకు నిధుల కేటాయింపు!

image

అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. గతేడాది పోషణ వాటిక కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన అంగన్వాడీలకు అందులో కనీస సౌకర్యాలు, కల్పించాల్సిన సౌకర్యాల కోసం ఒక్కో కేంద్రానికి రూ.25 వేల మంజూరు చేసింది. జిల్లాలో ఎంపికైన 227 అంగన్వాడీ కేంద్రాలకు రూ.56 లక్షలు మంజూరయ్యాయి. వీటితో చిన్నారులకు మ్యాట్లు, క్రీడా సామగ్రి, ఇతర పరికరాల కొనుగోలుకు వినియోగించనున్నారు.

News March 22, 2026

కొండచిలువల రక్తంలో బరువును తగ్గించే మాలిక్యూల్

image

బర్మీస్ కొండచిలువలు తమ శరీర బరువుకు సమానమైన ఆహారాన్ని తినగలవు. ఆ తర్వాత నెలలపాటు తిండి లేకుండా ఉండగలవు. ఇలాంటి అసాధారణ జీవక్రియకు వాటి రక్తంలోని pTOS మాలిక్యూల్ కారణమని స్టాన్‌ఫోర్డ్(US) సైంటిస్టులు గుర్తించారు. దీన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లలో వాడొచ్చని, ఊబకాయంపై పోరాటంలో ఇదొక కీలక మలుపు అని పేర్కొన్నారు. pTOSను ఎలుకలకు ఇవ్వగా అవి తక్కువ ఆహారం తిని 28 రోజుల్లోనే 9% బరువు తగ్గాయన్నారు.