News September 12, 2025
‘అన్నమయ్య కలెక్టర్ సేవలు మరువలేనివి’

అన్నమయ్య జిల్లాకు ఒక సంవత్సరంలో మూడు నెలల కాలంలో కలెక్టర్ చామకూరి శ్రీధర్ అనేక రకాలుగా సేవలు అందించారని గాజుల ఖాదర్ బాషా పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాకు గౌరవ కలెక్టర్ చామకూరి శ్రీధర్ విశిష్ట సేవలు అందించి మంచి కలెక్టర్‌గా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని అన్నారు. నేడు కలెక్టర్ బదిలీ కారణంగా అందరికీ బాధగా ఉందని అయన తెలిపారు.
Similar News
News September 13, 2025
JNTU: బీటెక్ 1st ఇయర్ 2nd సెమిస్టర్ ఫలితాలు

జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్ 1st ఇయర్ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డైరెక్టర్ విడుదల చేశారు. పరీక్షకు 16,521 మంది నమోదు చేసుకోగా 15,762 మంది హాజరయ్యారు. పరీక్షలు అన్ని సబ్జెక్టులలో 6,680 పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించగా 42.38% పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
News September 13, 2025
భవనం గుండా ఫ్లైఓవర్.. ఎక్కడంటే?

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉంటాఖానా అశోక్ చౌక్ వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ చర్చనీయాంశమవుతోంది. ఫ్లైఓవర్‌ను ఏకంగా నివాస భవనం గుండా తీసుకెళ్లడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. జవాబుదారీతనం లేకపోవడంతోనే ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలోనూ ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన విషయం తెలిసిందే.
News September 13, 2025
HYD: ‘ఆర్టీసీలోనూ యూనియన్లను పునరుద్ధరించాలి’

తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన 9 సంఘాలను సీఎం పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడంతో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలని ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని 2021 PRC ప్రకటించాలని సీఎంకి విజ్ఞప్తి చేస్తూ సీఎంవోలో వినతి పత్రం ఇచ్చారు.