News September 12, 2025

భూ సమస్యలపై త్వరిత పరిష్కారం: ఆదితిసింగ్

image

కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జేసీ ఆదితిసింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సంబంధిత ఫిర్యాదులకు బాధ్యతాయుతంగా స్పందించి, వచ్చే నెలలోపు పెండింగ్ ఫిర్యాదులను “సున్నా” స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. సెక్షన్ 22-ఏ డెలిషన్, అసైన్డ్ భూముల పరిష్కారంలో క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరని పేర్కొన్నారు.

Similar News

News April 10, 2026

ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,280
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,058
*వెండి 10 గ్రాముల ధర రూ.2,460

News April 10, 2026

కడప: యువతి గొంతు కోసి హత్య

image

కడప జిల్లా ఖాజీపేట పట్టణంలో దారుణం జరిగింది. అగ్రహారం ఏరియాకు చెందిన యువతిని ఓ యువకుడు గొంతు కోశాడు. చికిత్స నిమిత్తం కడపకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. నిందితుడు కొట్టాలు గ్రామానికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ యువకుడి(19)గా గుర్తించారు. తనను పెళ్లి చేసుకోలేదని ప్రేమోన్మాదిగా మారి మర్డర్ చేశాడని తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

News April 10, 2026

పులివెందుల యువతి గ్రేట్..!

image

పులివెందుల పట్టణానికి చెందిన అనిలాదేవి, గురుదత్తల కుమార్తె సాయి వర్షిత తాజాగా విడుదలైన SSC CGL ఫలితాల్లో సత్తాచాటారు. ఇన్‌కం ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆమె గతేడాది ఐదు సెంట్రల్ జాబ్స్ సాధించి ఔరా అనిపించారు. న్యాయ శాస్త్రం చదివిన ఐదేళ్లలో నాలుగు బంగారు పతకాలు సాధించడం విశేషం. ఆమెను పలువురు అభినందించారు.