News September 12, 2025

15 రోజుల్లో 214 మంది పోకిరీలను పట్టుకున్న షీ టీమ్స్

image

రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్‌ షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో పోకిరీలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. గత నెల 16 నుంచి 31 వరకు వచ్చిన 228 ఫిర్యాదుల మేరకు 214 మందిని (మేజర్స్‌ 94, మైనర్స్‌ 120) పట్టుకున్నారు. వీరందరికి ఎల్బీనగర్‌ CP క్యాంప్‌ ఆఫీసులో కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేపట్టారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాలు మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నాయన్నారు.

Similar News

News March 14, 2026

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి సవిత

image

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మంత్రి సవితను శనివారం కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. మంత్రి వినతులు స్వీకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.

News March 14, 2026

సూళ్లూరుపేట: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడీ

image

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలను అపహరించుకొని పరారయ్యాడు. ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 14, 2026

NRPT: జిల్లాలో సిలిండర్ల కొరత లేదు: అదనపు కలెక్టర్

image

జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, గృహావసరాలకు విద్యాలయాలకు, ఆసుపత్రులకు సిలిండర్ల సరఫరాలో లోటు రానివ్వమని అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో గ్యాస్ డీలర్లు సెల్స్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. సిలిండర్ల సరఫరాకు సంబంధించిన వివరాలను ప్రతి రోజు అందించాలని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలను నమ్మకండని సూచించారు.