News September 12, 2025
జగిత్యాల: బంగారు దొంగల చిత్రం.. సీసీ కెమెరాలో నిక్షిప్తం

జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు మభ్యపెట్టి వృద్ధురాలు గొల్లపల్లి లింగవ్వ మెడలో నుంచి రెండు తులాల బంగారు నగలను ఎత్తుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా సీసీ కెమెరా చిత్రాల్లో, వారు దొంగతనం చేసిన తర్వాత బైక్‌పై వెళ్లే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దొంగలను ఎవరైనా గుర్తిస్తే SI, జగిత్యాల రూరల్ 8712656822కు సమాచారం అందించవచ్చని రూరల్ పోలీసులు తెలిపారు.
Similar News
News September 13, 2025
ఆసియా కప్: ఒమన్‌పై పాకిస్థాన్ విజయం

ఆసియా కప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఒమన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆ జట్టు 67 రన్స్‌కే ఆలౌట్ అయింది. హమద్ మీర్జా(27) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో అష్రఫ్, సుఫియాన్ ముకీమ్, సయీమ్ అయుబ్ తలో 2 వికెట్లతో రాణించారు.
News September 13, 2025
JNTU: బీటెక్ 1st ఇయర్ 2nd సెమిస్టర్ ఫలితాలు

జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్ 1st ఇయర్ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డైరెక్టర్ విడుదల చేశారు. పరీక్షకు 16,521 మంది నమోదు చేసుకోగా 15,762 మంది హాజరయ్యారు. పరీక్షలు అన్ని సబ్జెక్టులలో 6,680 పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించగా 42.38% పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
News September 13, 2025
భవనం గుండా ఫ్లైఓవర్.. ఎక్కడంటే?

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉంటాఖానా అశోక్ చౌక్ వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ చర్చనీయాంశమవుతోంది. ఫ్లైఓవర్‌ను ఏకంగా నివాస భవనం గుండా తీసుకెళ్లడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. జవాబుదారీతనం లేకపోవడంతోనే ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలోనూ ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన విషయం తెలిసిందే.