News September 12, 2025
ములుగు: కామారెడ్డి సభతో కేంద్రంపై శంకరావం: సీతక్క

ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బీసీ డిక్లరేషన్ సభతో కేంద్ర ప్రభుత్వంపై శంఖారావం పూరిస్తామని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని మంత్రి అన్నారు.
Similar News
News March 16, 2026
తిరుమల శ్రీవారికి నూతన పరదాల సమర్పణ

ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారికి నూతన పరదాలను సమర్పించారు. బంగారు వాకిలి వద్ద ఉపయోగించే ఈ పరదాలపై నేత్ర దర్శనం, పూర్ణకుంభం, శంఖు–చక్రాలు, తిరునామం, గోమాత, గజవాహనం, మామిడి తోరణాలు, అరటి గెలలు వంటి శుభ చిహ్నాలను ముద్రించారు. ఉగాది సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. పరదాల మణి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ఆలయ అధికారులకు అందజేశారు.
News March 16, 2026
రైతులకు ఉచితంగా యూరియా!

TG: రైతులకు ఉచితంగా యూరియా సరఫరా కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ‘రైతు భరోసా’ జాప్యం నేపథ్యంలో యూరియా ఉచిత సరఫరా వల్ల రైతులకు ఒకింత ఊరట, ప్రయోజనం కలుగుతుందని అందులో వివరించింది. గత BRS ప్రభుత్వ హయాంలోనూ రైతులకు ఉచిత యూరియా పంపిణీ చేయాలని ప్రతిపాదించినా అమలు కాలేదు. ఈసారి CM ఆమోదం తర్వాత ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలలో దీనిని చేర్చే అవకాశం ఉంది.
News March 16, 2026
పాతపట్నం: రైలు ఢీకొని 29 ఏళ్ల యువకుడి మృతి

పాతపట్నం – తెంబూరు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తు పూరి – గుణుపూర్ రైలు ఢీకొని ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పలాస జీఆర్పీ ఎస్సై కోటేశ్వరరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతుడిది ఒడిశాలోని సింగపూర్ గ్రామస్థుడు భివిషాణ్(29)గా గుర్తించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.


