News September 12, 2025
రాష్ట్రంలో ఎరువులకు కొరతలేదు: మంత్రి

రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ, కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులతో ప్రతిరోజూ సమీక్షలు జరుపుతున్నామన్నారు.
Similar News
News September 13, 2025
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి

తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ & కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఆమెకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
News September 13, 2025
HYD: 9999 నంబరుకు రూ.25 లక్షలు

ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే భారీగా ఆదాయం వచ్చింది. TG 09 G 9999 నెంబర్‌ను రూ.25,50,200కు, TG 09 H 0009ను రూ. 6,50,009, TG 09 Η 0001ను రూ.6,25,999, TG 09 Η 0006ను రూ.5,11,666, TG 09 H 0005ను రూ.2,22,000కు పలువురు ప్రముఖులు దక్కించుకున్నారు. దీంతో మొత్తం రూ.63,77,361 ఆదాయం సమకూరింది.
News September 13, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,43,000గా ఉంది. రెండు రోజుల్లో కేజీ సిల్వర్‌పై రూ.3వేలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.